తిరుపతికి బయల్దేరిన సీఎం చంద్రబాబు...! 21 h ago
AP: అమరావతి నుంచి తిరుపతికి సీఎం చంద్రబాబు బయలుదేరారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో బాధితులను పరామర్శించనున్నారు. ఇప్పటికే తొక్కిసలాటపై చంద్రబాబుకు నివేదిక చేరింది. మరోవైపు, తిరుపతి తొక్కిసలాట ఘటనపై రెండు కేసులు నమోదు అయ్యాయి. బైరాగిపట్టెడ పద్మావతి పార్క్‌లో తొక్కిసలాట ఘటనపై ఈస్ట్ పీఎస్‌లో నారాయణపురం ఎంఆర్‌వో ఫిర్యాదు చేశారు. విష్ణు నివాసంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బాలయ్యపల్లె ఎంఆర్‌వో ఫిర్యాదు చేసారు.