ఆ ఫ్రిడ్జ్ లో పుర్రె, ఎముకలు...! 20 h ago
కేరళలోని ఓ భయానక ఘటన చోటుచేసుకుంది. చొట్టనిక్కర్ అనే ఊరిలో ఓ పాడుపడిన ఇంటిని అసాంఘిక శక్తులకు ఉపయోగిస్తున్నారని అక్కడి పంచాయితీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు కంగుతిన్నారు. అక్కడ ఉన్న ఫ్రిడ్జ్ లో మనిషి పుర్రె, ఎముకలు కనిపించాయని, కానీ అవి చాలా ఏళ్ల కిందటివిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మరింత వివరాలు తెలుసుకోవడం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.