తిరుపతి తొక్కిసలాటలో 6 కు చేరిన మృతుల సంఖ్య..! 21 h ago
AP: తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా మొత్తం మూడు చోట్ల తొక్కిసలాట చోటుచేసుకుంది. విష్ణునివాసం దగ్గర తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. గురువారం తెల్లవారుజాము నుంచి టోకెన్ల జారీకి ఏర్పాట్లు చేశారు. కాగా, బుధవారం సాయంత్రం నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. అలిపిరి, శ్రీనివాసం, సత్యనారాయణపురం..పద్మావతిపురంలో భక్తులు పోటెత్తటంతో తొక్కిసలాట జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.