ఒకే విడతలో ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు..! 1 d ago
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకి ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు చివరి తేదీ జనవరి 17, నామినేషన్ల విత్‌డ్రాకు 20వ తేదీ వరకు అవకాశం ఉంది. ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.