వచ్చే ఐపీఎల్‌లో మారనున్న అతడి రోల్..! 19 h ago
వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం కెప్టెన్ సంజూ శాంసన్ ను రాజస్థాన్ రాయల్స్ రూ.18 కోట్లకు అట్టి పెట్టుకున్న విషయం తెలిసిందే. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన సంజూ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వికెట్ కీపింగ్ బాధ్యతలను అతడు త్యాగం చేయనున్నాడు. ఇన్నాళ్లు ఆ బాధ్యతలను నిర్వర్తించిన సంజూ, ఇక నుండి యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ కు వాటిని అప్పగించేందుకు సిద్ధమవుతున్నాడు. బ్యాటింగ్ తోపాటు సారథ్య బాధ్యతల పైనే పూర్తిగా దృష్టి సారించేందుకు అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ధ్రువ్ జురెల్‌తో చర్చించానని సంజూ తెలిపాడు. ముఖ్యంగా టీమ్ఇండియా రెండో చాయిస్ టెస్టు వికెట్ కీపర్‌గా అతడు ఎదిగిన తర్వాత.. వికెట్ల వెనక బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు శాంసన్ వెల్లడించాడు. అయితే.. తామిద్దరమూ వికెట్ కీపింగ్ బాధ్యతలను పంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయని వెల్లడించాడు.