గుంటూరు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అరెస్ట్..! 19 h ago
AP: గుంటూరు డిప్యూటీ మేయర్ వైసీపీ నేత డైమండ్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. డైమండ్ బాబుపై భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. గుంటూరు నగరంలో ఓ స్థలం వివాదంలో టీడీపీ నేత ఫిర్యాదుతో పట్టాభిపురం పోలీసులు డైమండ్ బాబును అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి డైమండ్ బాబుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులు విచారించారు.