మహిళ శరీర నిర్మాణాన్ని కించపరిచినా నేరమే..! 1 d ago
కేరళ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మహిళల శరీర నిర్మాణం, ఆకృతి గురించి వ్యాఖ్యానించడం లైంగిక వేధింపులతో సమానమని వెల్లడించింది. ఐపీసీ 354 (1)(iv ), 509, కేరళ పోలీసు చట్టం (కప్ చట్టం) సెక్షన్ 120(o) ప్రకారం నేరమని స్పష్టం చేసింది. తన మొబైల్‌కు ఉన్నతోద్యోగి అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్నారని, విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా సీనియర్ అసిస్టెంట్ 2017లో కేసు నమోదు చేశారు. కేసు విచారణలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.