Los Angeles: ఓ పక్క కార్చిచ్చు.. మరోవైపు దోపిడీ దొంగలు 9 h ago
ఒకప్పుడు సంపదతో తులతూగిన లాస్ ఏంజెలెస్ నగరం నేడు మరుభూమిని తలపిస్తోంది. ధనవంతులు, హాలీవుడ్ స్టార్లు వదిలేసి వెళ్లిపోయిన ఇళ్లల్లో ఖరీదైన వస్తువులను దొంగలు దోచుకుంటున్నారు. ఇటీవల అక్కడి షరీఫ్ డిపార్ట్మెంట్ 20మంది లూటర్లను అరెస్టు చేసినట్లు పేర్కొంది. ఎవరైనా వదిలేసిన ఆస్తుల జోలికివస్తే కఠిన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది అన్నారు. సంక్షోభ సమయంలో ప్రజలను దోచుకునేవారు సిగ్గుపడాలని కౌంటీ సూపర్వైజర్ కాథరిన్ బెర్జర్ వ్యాఖ్యానించారు.