పాలిటెక్ ఫెస్ట్‌లో ఎంపీ నారా లోకేష్.. ! 1 d ago
విజయవాడలోని లబ్బీపేట ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పాలిటెక్ ఫెస్ట్‌లో ఎంపీ నారా లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఆయన విద్యార్థులను ప్రేరేపిస్తూ, పట్టుదలతో లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మార్చేందుకు హామీ ఇచ్చారు. ఉత్తమ ఆవిష్కరణలపై అవార్డులు అందజేశారు. చంద్రబాబు గారు డేర్ టు డ్రీమ్ స్ట్రైవ్ టు ఎచీవ్ అని చెబుతుంటారని ఆయన మాటలను స్పూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.