వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన పీవీ సింధు 20 h ago
బ్యాడ్మింటన్ కోర్టులో అద్భుతమైన ప్రదర్శనతో చారిత్రక విజయాలు సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఆదివారం ఆమె వివాహం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ప్రత్యేక అతిథుల సమక్షంలో రాత్రి 11.20 గంటలకు మూడుముళ్ల బంధంతో సాయి-సింధు ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్ ఈ వేడుకకు వేదికగా నిలిచింది. మంగళవారం(24) హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది.