Pakistan: గనికి వెళ్తుండగా.. 16మంది కిడ్నాప్ 18 h ago
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో యురేనియం, ప్లూటోనియం గనిలో పనిచేస్తున్న 16 మంది కార్మికులను గుర్తుతెలియని సాయుధులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన కార్మికులు గనికి వెళ్ళే మార్గంలో జరిగింది. కిడ్నాప్ చేసిన తర్వాత, వారిని గుర్తుతెలియని ప్రదేశానికి తరలించారు. తరువాత ప్రయాణించిన వాహనాన్ని నిందితులు తగలబెట్టారు. పోలీసు విభాగాలు ఈ కేసు గురించి విచారణ మొదలుపెట్టాయి.