తిరుపతి తొక్కసిలాటకు అతనే బాధ్యుడు: భూమన 20 h ago
AP: తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కేంద్రాల వద్ద తొక్కిసలాటపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి స్పందించారు. 'కొండమీద దర్శనాల నిర్వహణ బాధ్యత ఏఈఓ వెంకన్న చౌదరిదే. కానీ, అతను సీఎం చంద్రబాబు సేవలో తరిస్తున్నాడు. క్యూలైన్ వద్ద పట్టుమని పది మంది పోలీసులు కూడా లేరు. అందరూ పీఎం పర్యటనలో నిమగ్నమయ్యారు. మా ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరగలేదు. దీనికి పూర్తి బాధ్యత ఏఈఓదే.' అని అన్నారు.