2వేల మంది ఒకేసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు..! 19 h ago
AP: తొక్కిసలాట ఘటనపై తిరుపతి జిల్లా కలెక్టర్ స్పందించారు. గేట్ సడెన్ గా తెరవడంతో 2 వేల మంది ఒకేసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట చోటు చేసుకుందని చెప్పారు. 35 మంది క్షతగాత్రులకు రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందుతుందని తెలిపారు. ఘటనకు గల కారణాలను తెలుసుకుంటున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.