ప్రజలకు నష్టంచేసే మీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం- జగన్ 1 d ago
AP : కూటమి ప్రభత్వం ఆరోగ్యశ్రీ పధకం రద్దు చేస్తున్న ఘటన పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. చంద్రబాబుగారు… బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ అని ఎన్నికల్లో మీరు ఊదరగొట్టారని అన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక మీరిచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఇచ్చిన హామీలను ఎలాగూ ఎగరగొడుతున్నారని విమర్శించారు. మేం ఇచ్చిన పథకాలనూ రద్దుచేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కోటిన్నర కుటుంబాల ఆరోగ్యానికి ష్యూరిటీ లేదు కదా, ఉన్న గ్యారెంటీని తీసేశారని ఎద్దేవా చేశారు. ప్రజలకు నష్టంచేసే మీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మండిపడ్డారు. వెంటనే ఆరోగ్యశ్రీని యథాతథంగా ఉంచి అమలు చేయాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నానని సోషల్ మీడియా వేదికగా జగన్ పోస్ట్ చేశారు.