తెలుగు సినీ ఇండస్ట్రీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు..! 14 h ago
TG : సినీ ఇండస్ట్రీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ కోసం యువకులు బలిదానం చేసుకుంటే, సినీ నటులు చేతులు ముడుచుకుని కూర్చున్నారని విమర్శించారు. సినిమా వాళ్ళు ఏం చేశారు..ఏవైనా గ్రామాలను దత్తత తీసుకున్నారా? అని ప్రశ్నించారు. మెగాస్టార్ చిరంజీవి తప్ప ఎవరైనా ప్రజల కోసం మంచి కార్యక్రమాలు చేస్తున్నారా అని, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయమని ఏ హీరో అయినా అభిమానులకు ఏ రోజైనా పిలుపునిచ్చారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి ఒక్కరే బ్లడ్ బ్యాంక్ స్థాపించి కొన్ని లక్షల మందికి ఆసరాగా నిలిచాడు. చిరంజీవి వారసులుగా చెప్పుకునే కొందరు కనీసం ఒక్క రూపాయి సహాయం చేశారా, వీళ్లంతా సినిమాలతో పాటు నిజ జీవితంలో కూడా నటిస్తున్నారని ఎమ్మెల్యే యెన్నం ఏద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు అన్ని గమనిస్తున్నారని చెప్పారు. వీరికంటే సోనూసూద్ ఎంతో బెటర్ అని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.