ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు తో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం 16 h ago
సంధ్య థియేటర్ ఘటనలో టికెట్ పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీని పై నిర్మాత సూర్య దేవర నాగ వంశీ డాకు మహారాజ్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారని.. ఆయన హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలవడం పై నిర్ణయం తీసుకుంటాం అని తెలిపారు.