ఊటీ లో "థామా" మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ..! 20 h ago
నేషనల్ క్రష్ రష్మిక మందాన "థామా" అనే హిందీ మూవీ లో నటించనున్న విషయం తెలిసిందే. దినేష్ విజయ్ హారర్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ మూవీని ఆదిత్య సర్పోధర్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ సెట్స్ లో పాల్గొన్న రష్మిక పై పరిచయ సన్నివేశాలను షూట్ చేసినట్లు సమాచారం. దీని తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరి లో ఊటీ లో ప్రారంభం కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది.