టీటీడీ చైర్మన్ తాగి మాట్లాడినట్లు ఉంది: రోజా 22 h ago
AP:తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారికి రూ. కోటి..క్షతగాత్రులకు రూ. 25లక్షలు ఇవ్వాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. తాము ఐదేళ్ల కాలంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు చేశామని గుర్తు చేశారు. అడిషనల్ ఈఓ వెంకన్న చౌదరిని తొలగిస్తే..తిరుమల బాగుపడుతుందని చెప్పారు. ఘటన తర్వాత చైర్మన్ చాలా నిర్లక్ష్యంగా మాట్లాడారని, హైదరాబాద్‌లో కూర్చుని ఆయన మాట్లాడిన మాటలు చూస్తే తాగి మాట్లాడినట్లుగా ఉందని రోజా మండిపడ్డారు.: