అన్నమయ్య జిల్లా సైనిక్ స్కూల్‌లో టీచర్ పోస్టులు..! 19 h ago
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా కలికిరిలోని సైనిక్ స్కూల్‌లో టీచింగ్ ఖాళీల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు స్కూల్ మెడికల్ ఆఫీసర్ -01, పీజీటి (కంప్యూటర్ సైన్స్/ మ్యాథమెటిక్స్)-02, టీజీటీ (సోషల్ సైన్స్)-01, పీటీఐ -01, కౌన్సిలర్-01, హార్స్ రైడింగ్ ఇన్‌స్ట్రక్టర్-01 మొత్తం 07 పోస్టులు ఉన్నవి. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, బీఈ, బీటెక్, ఎంసీఏ/ఎంబీఏ, బీఏ, బీఎడ్, ఎంఏ, బీపీఈడీ, ఎంఏ/ఎంఎస్సీ, పీజీ డిప్లొమా, ఎంబీబీఎస్, టెట్/సీటెట్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరీజ్ఞానము, ఉద్యోగానుభవం ఉండాలి. ఎంపిక ప్రక్రియ విద్యార్హతలు, రాత పరీక్ష, ఉద్యోగానుభవం, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్/ఓబీసీ ఎన్‌సీఎల్ అభ్యర్ధులకు రూ. 500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు ఫీజు రూ. 250. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో జనవరి 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరములకు ఇక్కడ క్లిక్ చేయండి.