Bhagat Singh Gallery: పాకిస్థాన్లో భగత్ సింగ్ గ్యాలరీ ప్రారంభం..! 4 d ago
స్వాతంత్ర్య సమరయోధుడు భగత్సంగ్ ను 93 ఏళ్ల క్రితం విచారించిన చారిత్రక పూంఛ్ హౌస్ లోని భగత్ సింగ్ గ్యాలరీని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(పాకిస్థాన్) జాహిద్ అఖ్తర్ జమన్ ప్రారంభించారు. ఈ గ్యాలరీలో భగత్ సింగ్ ఫోటోలు, లేఖలు, నాటి వార్తాపత్రికలు, జీవిత విశేషాలు, ఆయన గురించి ప్రచురితమైన స్మారక వ్యాసాలు, భగత్ సింగ్ బృంద విచారణ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. అలాగే, పంజాబ్ ప్రభుత్వం(పాకిస్థాన్) తొలిసారిగా 2018లో భగత్ సింగ్ కేసు ఫైలకు సంబంధించిన కొన్ని రికార్డులను ప్రదర్శించింది. బ్రిటిష్ పోలీస్ అధికారి జాన్ పి. సాండెర్స్ను హత్య చేశారన్న నేరాభియోగంపై భగత్ సింగ్ తో పాటు రాజ్ గురుపై అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన పలు పత్రాలను తాజాగా పాక్ పంజాబ్ ప్రభుత్వం గ్యాలరీలో ఉంచింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న నేరంపై భగత్సంగ్ను 23 ఏళ్ల వయస్సులో బ్రిటిష్ ప్రభుత్వం మార్చి 23, 1931న లాహోర్లో ఉరితీసింది. భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్ ఛైర్మన్ అడ్వకేట్ ఇంతియాజ్ రషీద్ ఖురేషీ మాట్లాడుతూ ఈ గ్యాలరీకి 'షాడ్మన్ చౌక్' గా నామకరణం చేయాల్సిన అవసరం ఉందన్నారు.