Manabadi: విద్యార్ధులకు ఉపాధ్యాయులకు కరదీపికలా మనబడి మాసపత్రిక! 13 d ago
'మనబడి మాసపత్రిక' ను ఉపాధ్యాయులు, విద్యా వేత్తల వ్యాసాలు, ఆలోచనలతో అందంగా, ఆకర్షణీయంగా తీసుకువస్తామని సమగ్ర శిక్షా పథక సంచాలకుడు(ఎస్పీడీ) శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులు రాసిన కథలు, వేసిన బొమ్మలు, పాటలు, కవితలు, వినూత్న ప్రయోగాలు, ఆటలు, సాధించిన విజయాలు, బహుమతులతో వారి విజయగాధలకే పత్రికలో అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. 'ప్రతినెలా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కరదీపికలా ఉపయోగపడే మనబడి మాసపత్రికను పంపుతామని, సామాజిక మాధ్యమాల ద్వారా దీనిని అందరికీ చేరుస్తాం' అని చెప్పారు. ఆసక్తిగల విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ రచనలను 87126 52298 నంబరుకు వాట్సప్ ద్వారా గానీ లేదా manabadimagazine@gmail.com కు లేదా సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయానికి కూడా నేరుగా పంపించవచ్చునని తెలిపారు.