CV Anand: మీడియా ప్రశ్నలతో సహనం కోల్పోయాను...! 15 d ago
TG : హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ క్షమాపణలు చెప్పారు. నేషనల్ మీడియాను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. సంధ్య థియేటర్ ఘటనపై జాతీయ మీడియా ప్రశ్నలు అడిగినప్పుడు తాను సహనాన్ని కోల్పోయినట్లు తెలిపారు. సంధ్య థియేటర్ వద్ద అసలేం జరిగిందో తెలుపుతూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్.. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. థియేటర్లో ఆరోజు ఏం జరిగిందో తెలుపుతూ కొన్ని వీడియోలను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మీడియా ఆయన్ను కొన్ని విషయాలపై ప్రశ్నించగా.. నేషనల్ మీడియా ఈ ఘటనకు మద్దతు ఇస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ ఉన్న కొందరు జర్నలిస్టులు ఈ ఆరోపణలను తప్పుపట్టారు. తాజాగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సీవీ ఆనంద్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. “ఈ ఘటనపై విచారణ జరుగుతోందన్నారు. ప్రెస్‌మీట్లో రెచ్చగొట్టే ప్రశ్నలు వేయడంతో నేను కాస్త సహనాన్ని కోల్పోయానని చెప్పారు. పరిస్థితులు ఎలా ఉన్నా సంయమనం పాటించాల్సి ఉంటుందన్నారు. నేను చేసింది పొరబాటుగా భావిస్తున్నానని అన్నారు. నేషనల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని క్షమాపణలు కోరుతున్నా” అని ఆయన వెల్లడించారు.