Rajinikanth: సంబంధం లేని ప్రశ్నలు అడగొద్దు-రజినీకాంత్ 21 h ago
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా డైరెక్టర్ లోకేష్ తెరకెక్కిస్తున్న చిత్రం 'కూలి'. ఈ మూవీ షూటింగ్ కోసం థాయిలాండ్ వెళ్తున్న రజిని ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో కూలి సినిమా అప్డేట్ ను పంచుకున్నారు. అదే సమయంలో ఓ విలేకరి సమాజంలో మహిళల భద్రత గురించి ప్రశ్నించగా.. సంబంధం లేని ప్రశ్నలు అడగవద్దని రజినీ ఘాటుగా స్పందించారు. ఇటీవల చెన్నై లోని అన్నా యూనివర్సిటీ లో 19 ఏళ్ల విద్యార్థిని పై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర చర్చినీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విలేకరి మహిళల భద్రతపై ప్రశ్నించగా.. తనని రాజకీయ ప్రశ్నలు అడగవద్దని రజినీ అసహనం వ్యక్తం చేశారు.
ఇక కూలి మూవీ అప్డేట్ ఏంటంటే..
ఈ మూవీ షూటింగ్ 70 శాతం పూర్తయిందని చెప్పారు. ఈ నెల 13వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మరో షెడ్యూల్ జరుగుతుందని అన్నారు. త్వరలోనే దీనికి సంబందించి మరికొన్ని వివరాలను పంచుకోబోతున్నట్లు రజినీ తెలిపారు. రజినీకాంత్ 171వ చిత్రంగా 'కూలి' రూపొందుతుంది. 'లియో' మూవీ తర్వాత లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సాబీన్ షాహిర్, సత్య రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.