Droupadi Murmu: మన్మోహన్‌కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను...! 11 d ago
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మన్మోహన్ సింగ్ ఒకరని తెలిపారు. భారత ఆర్ధిక వ్యవస్థను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయ జీవితం, వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని అన్నారు. భరతమాత ముద్దుబిడ్డల్లో ఒకరైన మన్మోహన్‌కు మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలియజేస్తూ ద్రౌపది ముర్ము ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.