HMPV Virus Precautions: హెచ్ఎంపీవీ వైర‌స్ సోకితే..ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..! 3 d ago

featured-image

లక్షణాలు 


హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ప్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులుపేర్కొన్నారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా ఉండడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడానికి 3 - 6 రోజులు పడుతుంది. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం చిన్నారులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగిన వ్యక్తులు దీనిబారిన పడే అవకాశం వుందన్నారు . 


నివారణ చర్యలు... 


* సబ్బుతో 20 సెకండ్లు రోజూ చేతులు వాష్ చేసుకోవాలి

* శుభ్రం చేసుకోని చేతులతో ముఖాన్ని తాకకుండా ఉండాలి 

* వైరస్ బారినపడిన వ్యక్తులకు దూరంగా ఉండాలి  

* తరచూవాడే పరిసరాలను శుభ్రం చేసుకోవాలి

* వైరస్ బారినపడినవారు దగ్గు, తుమ్ము వచ్చేప్పుడు నోరు, ముక్కును కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి

* వైరస్ సోకిన వ్యక్తులు తమ వస్తువులను ఇతరులతో పంచుకోకుండదు  

ఆ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు నలుగురిలోకి వెళ్లడం కంటే ఇంట్లో రెస్ట్ తీసుకుంటే మంచిదని వైద్యులు వివరిస్తున్నారు. దీని ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెప్తున్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD