Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత..! 11 d ago
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 9:51 గంటలకు మృతి చెందారు. ఆయన మృతికి ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన నివాసంనందు మన్మోహన్ పార్థివదేహానికి నేతలు నివాళులర్పించారు. శనివారం AICC ప్రధాన కార్యాలయానికి మన్మోహన్ భౌతికకాయం తరలిస్తారు. అనంతరం, ఏఐసీసీ కార్యాలయం నుంచి మన్మోహన్ అంతిమయాత్ర మొదలవుతుంది. రేపు అధికారిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు చేయనున్నారు.