Perni Nani: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి పేర్ని నాని..! 14 d ago
మాజీ మంత్రి పేర్ని నాని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మచిలీపట్నం పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. రాజకీయ కారణాలతోనే అరెస్ట్ చేయాలని చూస్తున్నారని పేర్ని నాని పిటిషన్‌లో పేర్కొన్నారు. నోటీసులు రద్దు చేసి అరెస్ట్ నుంచి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంలో పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు కుమారుడిపై కేసు నమోదు అయ్యింది.