Rythu Bharosa: రైతు భరోసా అమల్లోకి మరో సమస్య..! 9 d ago
TG : తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు.. గబగబా పొలాల మధ్యలోకి వెళ్లి నిల్చుంటున్నారు. తోడుగా పొలం తాలూకు రైతును కూడా తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్లి.. తమ ట్యాబులను ఆన్ చేసి.. ఆకాశం వైపు చూస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారో రైతులకు అర్థం కావట్లేదు. ఒక్కోసారి ఆ ట్యాబ్లెట్లకు సిగ్నల్స్ అందట్లేదు. దాంతో.. అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అక్కడే అసలు సమస్య ఉంది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అందించేందుకు రైతుల పొలాలకు సంబంధించి కచ్చితమైన లెక్కలు వేస్తోంది. ఇందుకోసం శాటిలైట్ టెక్నాలజీని వాడుతోంది. శాటిలైట్ల ద్వారా పొలాలను సర్వే చేస్తోంది. ఏ పంటల్లో సాగు ఉందో శాటిలైట్లు చూపిస్తాయి. అలాగే.. ఆ పొలం ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఇలాంటి అన్ని వివరాలూ శాటిలైట్ డేటా యాప్‌లో కనిపిస్తాయి. కానీ ఈ వివరాలు చూపించాలంటే.. అధికారి కచ్చితంగా ఆ భూమి మధ్యలో ఉండాలి. అందుకే అధికారులు పొలాల దగ్గరకు వెళ్తున్నారు.
భూముల సర్వేకి సంబంధించి ఏఈఓలు మాన్యువల్ సర్వేలు చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి.. పొలం వివరాలు, రైతు వివరాలు అన్నీ నమోదు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ.. శాటిలైట్ సర్వే ద్వారా.. పంటల అసలు లెక్క తేల్చాలని అనుకుంటోంది. తద్వారా ఎక్కడా అక్రమాలకు ఛాన్స్ ఉండదు. కచ్చితంగా పంట వేసిన భూములకే రైతు భరోసా ఇస్తారు. రైతులతో అధికారులు కుమ్మక్కైనా, శాటిలైట్ డేటా ద్వారా.. అక్రమాలు బయటపడతాయి. అందుకే ప్రభుత్వం ఇలా చేస్తోంది. ఈ శాటిలైట్ సర్వేని రాష్ట్ర సర్కార్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ చేస్తోంది. ఏఈఓలు చేసిన సర్వేకీ, శాటిలైట్ డేటాకీ సరిపోలట్లేదు. దాదాపు 10 విషయాల్లో తేడాలు వస్తున్నాయి. శాటిలైట్ సర్వేలో అక్రమాలకు ఛాన్స్ ఉండదు. దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. అందువల్ల ఏఈఓలు అక్రమ సర్వేలు చేసినా, శాటిలైట్ సర్వేతో అక్రమాలు బయటపడతాయి. అందుకే ప్రభుత్వం శాటిలైట్ సర్వేని పక్కాగా చేయిస్తోంది.