Stock market: లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్లు..! 9 h ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి. మొదట రాణించిన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దీనితో సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 గంటల సెన్సెక్స్ 175 పాయింట్లు తగ్గి 77,444 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 69 పాయింట్లు తగ్గి 23,459 వద్ద కొనసాగుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ 85.88 వద్ద కొనసాగుతోంది.