Govt.scheme: మెరుగైన పోషకాహారాలు..సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్..! 7 d ago
దేశవ్యాప్తంగా అన్నీ గ్రామపంచాయితీల్లో స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పోషకాహార లోపాన్ని ఎదుర్కోనేందుకు, ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించేందుకు మరియు సమాజ శ్రేయస్సును మెరుగుపరచడానికి 'సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్' అనే కొత్త చొరవను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది.
దీన్ని ఒక లక్ష్యం..
ఆరోగ్యానికి సంబంధించిన మెరుగైన పోషకాహార పద్ధతులను అనుసరించేలా గ్రామప్రజలను ప్రోత్సహించడం. ముఖ్యంగా ఈ కార్యక్రమం పోషకాహార లోప నిర్మూలన, గ్రామ పంచాయతీలు, అంగన్వాడీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ మరియు సుస్థిరాభివృద్ధి వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించబడుతుంది. పోషకాహార ఫలితాలను మెరుగుపరచడానికి, గ్రామీణ జనాభాకు సాధికారత కల్పించడానికి స్థానిక సంస్థల ఆధారిత కార్యక్రమాల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఒక్కొక్క పంచాయితీకి రూ.1 లక్ష చొప్పున దేశవ్యాప్తంగా మొత్తం 1,000 గ్రామ పంచాయితీలలో ఉన్న అంగన్‌వాడీల ద్వారా మెరుగైన పోషకాహారాన్ని పిల్లలకు అందించబడుతుంది. ఆకలి బాధలను నివారించి ఆహార భద్రతను కల్పించి, పోషకత్వాన్ని మెరుగుపర్చడం, ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాల పెంపు వంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి సాధించేందుకు ఈ కార్యక్రమం కీలకపాత్రను పోషించనుంది.