TTD: తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..! 13 d ago
తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం అందించేందుకు టీటీడీ ఆటోమేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగించుకోవడానికి సన్నాహాలు చేస్తుంది. ఈ విధానం ద్వారా భక్తులు గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా, కేవలం గంట లేదా రెండు గంటల్లో శ్రీవారి దర్శనం పొందగలుగుతారు.
ఈ ప్రణాళికలో ఫేస్ రికగ్నిషన్ ఆధారిత ఎంట్రీ విధానం ఉంటుంది. మొదటగా, కియోస్క్ పద్ధతిలో భక్తుల ముఖం ఆధారంగా టోకెన్ జనరేట్ చేయబడుతుంది. తరువాత, భక్తులు ఫేషియల్ రికగ్నిషన్ బ్యారియర్ గేట్ ముందు నిలబడితే, గేట్లు ఆటోమేటిక్‌గా తెరుచుకుంటాయి, తద్వారా భక్తులకు మరింత సౌకర్యంగా దర్శనం పొందే అవకాశం కలుగుతుంది అని టీటీడీ అధికారులు తెలిపారు.
ఈ విధానాన్ని టీటీడీ బోర్డు సభ్యులు సోమవారం పరిశీలించి, మెరుగైన విధానాలను తీసుకుని త్వరలో భక్తులకు అందుబాటులోకి తేనున్నారు