V Narayanan: ఇస్రోకు నాయకత్వం వ‌హించ‌నున్న‌ వి నారాయణన్..! 21 h ago

featured-image

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నూతన చైర్మన్ గా వి నారాయణన్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ ఎస్ సోమనాథ్ పదవీ కాలం 2025, జనవరి 13 తో ముగియనుంది. అనంతరం జనవరి 14న నారాయణన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రెండేళ్ల పాటు చైర్మన్ గా కొనసాగనున్నారు.

ఎవరీ వి నారాయణన్:

తమిళనాడులోని కన్యాకుమారిలో వి నారాయణన్ జన్మించారు. ఐఐటీ ఖరగ్ పూర్లో క్రయోజెనిక్ ఇంజినీరింగ్ లో మొదటి ర్యాంకుతో ఎంటెక్ పూర్తిచేశారు. 2001లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లో పీహెచ్ డీ పూర్తి చేశారు. రాకెట్, అంతరిక్ష విమాన లాంచింగ్ టెక్నాలజీ నైపుణ్యంతో 1984లో ఇస్రోలో చేరారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కౌన్సిల్ స్పేస్ ట్రాన్స్‌పోర్టేష‌న్ చైర్మ‌న్‌గా, చంద్రునిపై మనిషిని తీసుకెళ్లే స్పేస్ ఫ్లైట్ మిషన్ నేషనల్ లెవెల్ హ్యూమనేటెడ్ సర్టిఫైడ్ బోర్డ్ ఫర్ గ‌గ‌న్ యాన్‌ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. నారాయణన్ ప్రస్తుతం అంతరిక్షంలోకి శాటిలైట్లను తీసుకెళ్లేందుకు ఉపయోగించే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్గా ఉన్నారు. శాటిలైట్ లాంచ్ వెహికల్స్, అందులో ఉపయోగించే కెమికల్స్, ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ఫర్ శాటిలైట్స్, లాంచ్ వెహికల్ కంట్రోల్ సిస్టమ్స్, లిక్విడ్, సెమీ క్రయోజనిక్, క్రయోజనిక్ ప్రొపల్షన్ దశల్ని ఈయనే పర్యవేక్షిస్తుంటారు. ఆదిత్య ఎల్-1, చంద్రయాన్-2,3 లోని చోదక వ్యవస్థల అభివృద్ధికి ఆయన కృషి చేశారు. GSLV MK-II, III వాహకనౌకల రూపకల్పనలో కీలకభూమిక వహించారు.


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD