Telecom: ఎయిర్ టెల్ కు భారీ ఊరట..! 13 d ago
ప్రైవేటు టెలికాం కంపెనీలైన జియో, వోడాఫోన్, ఐడియాకు, మరోసారి షాక్ తగిలింది. జులైలో చేపట్టిన ధరల పెంపు వలన వరుసగా సబ్‌స్క్రైబర్లను కోల్పోతున్న కంపెనీలు. అక్టోబర్ లోను పెద్ద సంఖ్యలో యూజర్లను కోల్పోయారు. ఎయిర్‌టెల్ మాత్రం కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకోగలిగింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్, మరోసారి కొంత మెరుగ్గా సబ్‌స్క్రైబర్ల సంఖ్యను పెంచుకుంది. అక్టోబర్ నెలలో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెలువరించిన డేటా ఈ విషయం వివరించింది.
అక్టోబర్ నెలలో ఎయిర్టెల్ 19.29 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంది. సెప్టెంబర్ లో ఇదే కంపెనీ 14.35 లక్షల మంది యూజర్లను చేర్చుకోవడం విశేషం. సెప్టెంబర్ లో దాదాపు 79.7 లక్షల మంది యూజర్లను జియో కోల్పోగా, అక్టోబర్లో 37.60 లక్షల మంది ఆ నెట్ వర్క్ ను వీడారు. అప్పుల ఊబిలో వున్న వోడాఫోన్, ఐడియా నుంచి 19.97 లక్షల మంది యూజర్లు ఆ నెట్ వర్క్ కు గుడ్ బై చెప్పారు. సెప్టెంబర్లో 15.5 లక్షలుగా మారింది.
టారిఫ్ ల తర్వాత ప్రైవేట్ రంగ టెలికాం సంస్థల నుంచి పెద్ద ఎత్తున యూజర్లను ఆకర్షించిన బీఎస్ఎన్ఎల్ అక్టోబర్ లో కొత్తగా 5 లక్షల మంది యూజర్లను పెంచుకుంది. సెప్టెంబర్ 8.5 లక్షల మంది యూజర్లతో పోలిస్తే సంఖ్య కొంచెం తక్కువే. పెద్ద సంఖ్యలో కోల్పోయినప్పటికీ 39.9 శాతం మార్కెట్ పరంగా రిలయన్స్ జియో అగ్రస్థానంలో వుంది. ఎయిర్టెల్ 33.50 % వోడాఫోన్ ఐడియా 18.30% బిఎస్ఎన్ఎల్ 8. 50 % వాటాతో తర్వాత స్థానాల్లో వున్నాయి. 4జీ సేవలు విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తే బీఎస్ఎన్ఎల్ యూజర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.