Chandrababu: మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి చంద్రబాబు నివాళి..! 10 d ago
మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. మన్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని అన్నారు. మన్మోహన్ సింగ్ మరణం బాధాకరం..ఆయన దేశానికి అవిశ్రాంతంగా సేవలందించారని పేర్కొన్నారు. ఆధార్, ఉపాధి హామీ సహా అనేక పథకాలు తెచ్చారని, దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. అనేక పదవులను సమర్ధవంతంగా నిర్వహించారని చంద్రబాబు వివరించారు.