Jimmy Carter: USA 39వ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మృతి..! 7 d ago

featured-image

అమెరికన్ రాజకీయవేత్త, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ డిసెంబర్, 29న మృతి చెందారు. డెమోక్రటిక్ పార్టీ సభ్యుడైన ఆయన 1963 నుండి 1967 వరకు జార్జియా రాష్ట్ర సెనేటర్‌గా, 1971 నుండి 1975 వరకు జార్జియాకు 76వ గవర్నర్‌గా పనిచేశారు. 1977 నుండి 1981 వరకు యునైటెడ్ స్టేట్స్ కి 39వ అధ్యక్షుడిగా పనిచేశారు. శాంతిని నెలకొల్పడం, పౌర, మానవ హక్కులను పురోగమించడం, స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలను ప్రోత్సహించడం, ఇతరులకు ఆదర్శంగా ఉంచడం కోసం కార్టర్ కృషి చేశారు. 


ఎక్కువ కాలం జీవించిన అమెరికన్ అధ్యక్షుడిగా జిమ్మీ కార్టర్ నిలిచారు. వ్యాధుల నిర్మూలన, శాంతి స్థాపన, పౌర, మానవ హక్కుల అభివృద్ధి, స్వేచ్ఛాయుత ఎన్నికలు తదితర అంశాల్లో ఆయన అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేశారు. 1978లో భారత్ పర్యటనకు వచ్చినందుకు గుర్తుగా హరియాణాలోని ఓ గ్రామానికి కార్టరురిగా నామకరణం చేశారు. థియోడర్ రూజ్వెల్ట్, ఉడ్రో విల్సన్ తర్వాత నోబెల్ శాంతి పురస్కారం గెలుచుకున్న మూడో అమెరికా ప్రెసిడెంట్ కార్టర్ గా నిలిచారు. అధ్యక్ష పదవీ కాలం తర్వాత చేసిన కృషికి ఆయనను 2002లో నోబెల్ శాంతి బహుమతి వరించింది.


కార్టర్ తన హయాంలో సాధించిన చరిత్రాత్మక విజయాలు.. 


క్యాంప్ డేవిడ్ ఒప్పందాలు: ఇజ్రాయెల్, ఈజిప్ట్ మధ్య శాశ్వత శాంతి ఒప్పందానికి బాటలు వేసిన క్యాంప్ డేవిడ్ ఒప్పందాలపై సంతకం చేయడంలో కార్టర్ కీలక పాత్ర పోషించారు.

పనామా కాలువ ఒప్పందాలు: పనామా కాలువ నియంత్రణను పనామాకు బదిలీ చేయడంలో కార్టర్ కీలకంగా వ్యవహరించారు. తద్వారా లాటిన్ అమెరికన్ దేశాలతో యూఎస్ సంబంధాలను బలోపేతం చేశారు. 

చైనా సంబంధాలు: కార్టర్ చైనాకు పూర్తి దౌత్యపరమైన గుర్తింపును మంజూరు చేశారు.

మానవ హక్కులపై దృష్టి: ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, శాంతిని పెంపొందించడం ద్వారా అమెరికా విదేశాంగ విధానంలో మానవ హక్కులకు ప్రాధాన్యతనిచ్చారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD