Governors: 5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..! 12 d ago

featured-image

కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాల్లో గవర్నర్లను బదిలీ చేయగా, రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా ఉన్న డాక్టర్ కంభంపాటి హరిబాబును ఒడిశాకు, బీహార్ గవర్నర్ గా కొనసాగుతున్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కేరళకు, కేరళ గవర్నర్‌గా ఉన్న ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ను బీహార్ కు బదిలీ చేసింది. మిజోరం గవర్నర్ జనరల్ గా విజయ్ కుమార్ సింగ్ ను, మణిపుర్ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించింది.


గవర్నర్ గురించి..

రాష్ట్రానికి గవర్నర్ ప్రధమ పౌరుడు. రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్ 153 నుంచి 167 వరకు రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ గురించి వివరణ ఉంటుంది. అందులో గవర్నర్, ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి, అడ్వకేట్ జనరల్ అంతర్భాగంగా ఉంటారు.


* ఆర్టికల్ 153: ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటారు.

* ఆర్టికల్ 154: గవర్నర్, రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వహణాధిపతిగా వ్యవహరిస్తారు.

* ఆర్టికల్ 155: గవర్నర్ నియామకం.

* ఆర్టికల్ 156: గవర్నర్ పదవీకాలం.

* ఆర్టికల్ 157: గవర్నర్ గా నియమితులయ్యే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు

* ఆర్టికల్ 158: గవర్నర్ గా నియమితులయ్యే వారికి సంబంధించిన షరతులు, జీతభత్యాలు, నివాస భవనం.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD