Stock Market: రెండో రోజూ నష్టాల్లో దేశీయ మార్కెట్ సూచీలు..! 18 h ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలతో మార్కెట్లు రెండోరోజూ కూడా నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 600 పాయిట్ల నష్టోయిన సూచీ 77,542.92 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 528.28 పాయింట్ల నష్టంతో 77,620.21 వద్ద ముగిసింది. నిఫ్టీ 162.45 పాయింట్ల నష్టంతో 23,526.50 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 3 పైసలు క్షీణించి 85.88గా ఉంది.