Microsoft: భారత్ లో మైక్రోసాఫ్ట్ 3 బిలియన్ డాలర్ల పెట్టుబడి.! 1 d ago
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారతదేశంలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. దేశంలో క్లౌడ్, కృత్రిమ మేధా సామర్థ్యాలను విస్తరించడానికి 3 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్లు మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. బెంగుళూరులో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన 2030 నాటికి కోటి మందికి కృత్రిమ మేధ (AI) స్కిల్స్ పై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.