N. Ashwani Kumar: జనసేన జనరల్ కౌన్సిల్‌గా ఎన్.అశ్వనీ కుమార్..! 20 d ago
జనసేన జనరల్ కౌన్సిల్‌గా ఎన్. అశ్వనీ కుమార్‌ను నియమించినట్లు.. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి. హరిప్రసాద్ ప్రకటించారు. ఈ మేరకు ఒక నోట్ విడుదల చేశారు. జనసేనకు కొన్ని సంవత్సరాలుగా సేవలందిస్తున్న అశ్వనీ కుమార్ ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో సీనియర్ న్యాయవాదిగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక నుంచి పార్టీ న్యాయ సంబంధిత అంశాలను ఆయన పర్యవేక్షిస్తారని తెలిపారు.