హైదరాబాద్ లో హైడ్రా అలజడి.. 3 m ago
8K News- Sep 11
హైదరాబాద్ లో ఆక్రమణలపై కొరడా జురుపిస్తూ అలజడి సృష్టిస్తున్నది హై డ్రా. హైదరాబాద్‌లో తరచూ కురుస్తున్న భారీవర్షాలు, వరదల కారణంగా నగరంలోని పలు పాంత్రాలు నీటమునిగి, ముంపుకు గురికావటం ప్రజాజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో ఈవరదలు నుండి శాశ్వత పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపధ్యంలో వరద ముంపు నివారణకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఏర్పాటు చేయటం జరిగింది. ఈ హైడ్రాకు కమీషనర్‌గా రంగనాధ్ ఉన్నారు. భారీవర్షాలు, ముంపుకు గురవుతున్న నేపధ్యంలో వరదనీరు బయటకు పంపించేందుకు నిర్మాత్మక చర్యల కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపద్యంలో వరదనీరు, ముంపు నివారణకు చెరువులు, పార్కులు, పభుత్వ స్దలాలు ఆక్రమణలకు గురైఅయ్యాయని వచ్చిన పిర్యాదులుపై క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలకు హైడ్రా ఉపక్రమించింది. అందుకోసం ఆపరేషన్ నాలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాలాలకు అడ్డుగా ఉన్న ప్రస్తుతం రామ్‌నగర్‌లోని మణిమ్మబస్తీ, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. పస్తుతం గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జిహెచ్ఎంసి) తో పాటూ ఔటర్ రింగ్‌రోడ్డు ఏరియాలో నాలాల విస్తరణ పరిధిలో 370 కిలోమీటర్ల మేర మేజర్ నాలాలు 1250 కి.మీటర్ల వరదనీటి కాలువలు ఉన్నాయి. వీటి సామర్ద్యం గంటకు 2 సెంటీమీటర్ల ఉంటుంది. హైడ్రా కార్యక్రమంలో భాగంగా నాలాల విస్తరణ, అభివృద్ధిచేయాలని ఆలోచన ప్రభుత్వం చేస్తుంది.
12 వేల ఆక్రమణల గుర్తింపు
గతంలో జిహెచ్ఎంసి చేసిన సర్వేలో నాలాలపై సుమారు 12 వేల ఆక్రమణలు గుర్తించారు. 35శాతం మేర రెండు, మూడు అంతస్తుల భవనాలను నాలాలపై నిర్మించారు. ఇది ఇలా ఉండగా 30 అడుగుల వెడల్పులో ఉన్న నాలాలు ప్రస్తుతం 10 అడుగులకు కుచించుకు పోయాయి. దీంతో పరిసర ప్రాంతాలు ముంపు కు గురవుతున్నాయని అదికారులు అంటున్నారు. నాలాలు అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు మేర ఖర్చుఅవుతాయని గతంలో అంచనాలు వేశారు. ఇది ఇలా ఉండగా పాతబస్తీ, మాదాపూర్ చెరువులు, శంషాబాద్ కామునిచెరువు, దుర్గం చెరువు, వీటితో పాటూ ఇతర ప్రాంతాలలో ఆక్రమణలు, విల్లాలు, కాలనీలు తొలగింపు చర్యలు చేపట్టారు. ఈ నేపధ్యంలో ప్రముఖ సినీ హీరో నాగార్జున కు చెందిన ఎన్ కన్వషన్ ను హైడ్రా అధికారులు నేలకూల్చారు. దీనిపై నాగార్జున స్పందించి మేము అక్రమంగా నిర్మించలేదని అంటూ కోర్టుకు వెళ్లటం జరిగింది. దీంతో పాటూ వివిధ రాజకీయ పార్టీనాయకులకు చెందిన కట్టడాలు కూడా తొలగించారు. ఫాతిమా కళాశాల అక్రమంగా నిర్మించారని హైడ్రా అదికారులు ఆ కళాశాలకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అదేవిధంగా మాజీ ఎంపి, సినీనటులు మురళీ మోహన్ కు నోటీసులు ఇచ్చారు. ఆక్రమకట్టడాల పేరుతో కట్టడాలను తొలగించాడానికి వచ్చిన హైడ్రా అధికారులు, సిబ్బందిపై ఆ ప్రాంతవాసులు వాగ్వివాదం చేయటం, వారిని అడ్డుకోవటం లాంటి చర్యలకు దిగారు. అక్రమంగా తొలగిస్తున్నారంటూ కొందరు కోర్టుకు వెళ్లటం చేస్తున్నారు. మా విధులకు ఆటంక పరుస్తున్నారంటూ హైడ్రా అధికారులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదులు చేశారు. హైడ్రా దూకుడు పెంచి ఆక్రమణలను తొలగించడంపై అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు సమర్దించగా, ప్రతిపక్షపార్టీలకుచెందిన కొందరు నాయకులు విమర్శలు చేస్తున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో దడ పుట్టిస్తూ హైడ్రా కలకలం రేపుతుంది. ఆక్రమణలు పూర్తిగా తొలగించి వరద, ముంపు నివారణకు శాశ్వతచర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సిఉంది.