Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు..! 1 d ago
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సోమవారం భారీ నష్టాల నుంచి మదుపర్లకు కాస్త ఊరట కల్పించాయి. ఇంట్రాడేలో 78,452.74 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచీ చివరికి 234.12 పాయింట్ల లాభంతో 78,199.11 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 91.85 పాయింట్ల లాభంతో 23,707 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 5 పైసలు క్షీణించి 85.73గా వుంది.