సినీ తారల ఇంట క్రిస్మస్ పండుగ...! 12 d ago
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా క్రిస్మస్ పండగను అందరూ జరుపుకుంటారు. కొందరు హీరో, హీరోయిన్లు కూడా రాత్రి నుండే సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. శాంటా క్లాస్ టోపీలు పెట్టుకొని, తెలుపు-ఎరుపు రంగు దుస్తులు వేసుకొని కేక్ కట్ చేస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చారు. వారిలో కృతి శెట్టి, ప్రగ్య జైస్వాల్, కావ్య కళ్యాణ్ రామ్, ఈషా రెబ్బా, మౌని రాయ్, రమ్య పాండియన్, ఆకాంక్ష సింగ్, నివేదా థామస్, మంచు విష్ణు ఉన్నారు.