అల్లు అర్జున్ అరెస్ట్… విడుదల పై పూర్తి కథనం..! 8 d ago

featured-image

హీరో అల్లు అర్జున్ డిసెంబర్ 4వ తేదీన సంధ్య థియేట‌ర్‌లోని పుష్ప 2 ప్రీమియర్ షో కి హాజరు అయ్యారు. ఆ సమయంలో జరిగిన తొక్కిస‌లాటలో రేవ‌తి అనే మ‌హిళ మృతి చెందింది. దీనికి అల్లు అర్జున్ కార‌ణ‌మంటూ ఫిర్యాదు అంద‌గా.. ఆయనపై 105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసు న‌మోదైంది. ఈ క్రమంలో పోలీసులు జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి ఆయనను అదుపులో తీసుకొని, త‌మ వాహ‌నంలో చిక్కడ పల్లి స్టేష‌న్ తీసుకెళ్లారు. అల్లు అర్జున్‌తో పాటు ఆయ‌న తండ్రి అల్లు అర‌వింద్ కూడా పోలీసుల‌తో పాటు వెళ్లారు. మరోవైపు అరెస్ట్ చేయకుండా ఆర్డర్‌ ఇవ్వాలని హైకోర్టు లో అల్లు అర్జున్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేశారు.

అల్లు అర్జున్ అరెస్ట్ తో చిరంజీవి షూటింగ్ మధ్యలో ఆపి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరారు. చిరంజీవిని పోలీస్ స్టేషన్‌కు రావొద్దని పోలీసులు అభ్యర్థించారు. ఈ క్రమంలో చిరంజీవి అతని సతీమణి సురేఖ తో కలిసి ఆలు అర్జున్ ఇంటికి చేరగా కాసేపటికి నాగ బాబు కూడా వెళ్లారు. అప్పటికే స్టేషన్ వద్దకు పలువురు సినీ ప్రముఖులు చేరుకోగా చిక్కడపల్లి స్టేషన్ దగ్గర భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. ఇలా ఉండగా అల్లు అర్జున్ ని వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం నాంపల్లి హై కోర్ట్ కి తరలించారు. నాంపల్లి హై కోర్ట్ లో అల్లు అర్జున్ కు14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ ని చంచ‌ల్ గూడ జైలుకు తరలించారు.మరోవైపు సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్ స్పందిస్తూ "ఇందులో అల్లు అర్జున్ కి సంబంధం లేదు నేను ఈ కేసును విత్ డ్రా చేసుకుంట అని తెలిపారు. అల్లు అర్జున్ ని చంచల్ గూడా జైలుకు తరలించిన కోద్ధిసేపటికి తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులు నిరాకరించలేమని హైకోర్టు తెలిపింది. అల్లుఅర్జున్ కు కూడా జీవించే హక్కు ఉందని, ఈ కేసులో పెట్టిన సెక్షన్ లో అల్లు అర్జున్ కు వర్తించవని హైకోర్టు తెలిపింది. బెయిల్ పేపర్స్ సరైన సమయానికి జైలు అధికారులకు అందకపోవడంతో అల్లు అర్జున్ కి ఖైదీ నంబర్ 7697 కేటాయించి మంజీరా బ్యారక్ క్లాస్-1 రూంలో ఖైదీగా ఉంచారు. దాదాపు 12 గంటలు జైలులో ఉంచి ఈ రోజు ఉదయం విడుదల చేశారు.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD