Malavika Mohan: "సలార్" మూవీపై కీలక వ్యాఖ్యలు చేసిన మాళవిక మోహన్..! 8 d ago
కోలీవుడ్ హీరోయిన్ మాళవిక మోహన్ సలార్ మూవీ లో నటించే అవకాశాన్ని కోల్పోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ " “నేను బాహుబలి మూవీ చూసాక ప్రభాస్ కి వీరాభిమానిని అయ్యాను. అతనితో కలిసి పని చేయాలని కోరుకున్నాను. కొన్ని ఏళ్ల తర్వాత నాకు "సలార్" మూవీ లో నటించే అవకాశం వచ్చింది. ఇది కలా.. నిజామా అని ఆశ్చర్యపోయాను. కానీ దురదృష్టవశాత్తు, కొన్ని కారణాల వల్ల అది జరగలేదు" అని మాళవిక తెలిపారు.