నో ఎంట్రీ 2 గురించి మీడియా తో మాట్లాడిన బోనీ కపూర్..! 12 d ago
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, బిపాసా బసు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం నో ఎంట్రీ. 2005 లో అనీస్ బాజ్మీ దర్శకత్వంలో బోనీ కపూర్ నిర్మించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్ గా రానున్న నో ఎంట్రీ 2 పై తాజాగా బోనీ కపూర్ మాట్లాడారు. "ఈ మూవీ షూటింగ్ జూన్ లో మొదలు కానుంది.. వచ్చే ఏడాది దీపావళి కానుకగా అక్టోబర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం కానీ షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్‌కే మాకు ఎక్కువ సమయం పట్టేలా ఉంది. మొదటి భాగంతో పోలిస్తే ఈ మూవీ చాలా గొప్పగా ఉండనుంది. ఈ కథ విన్న ప్రతి ఒక్కరు ఇదే చెప్పారు. ఈ చిత్రంలో అన్ని రకాల భావోద్వేగాలు ఉన్నాయి. నో ఎంట్రీ లో నటించిన నటీనటులను ఇందులో రిపీట్ చేయలేకపోతున్నందుకు బాధగా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో వారిని భాగం చేసేందుకు ఎంతోకాలం ఎదురు చూసా కానీ వాళ్ళకు ఏవేవో కారణాలు ఉండడంతో చేయలేకపోతున్న. వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూ వేరే నటీనటులతో సీక్వెల్ చేస్తున్న" అని బోనీ కపూర్ తెలిపారు.