Kanchana 4: కాంచన 4 లో పూజ హెగ్డే? 5 d ago
నటి పూజ హెగ్డే కోలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్, సూర్య హీరోలుగా నటిస్తున్న తమిళ్ మూవీస్ ని పూజ ఓకే చేసింది. తాజాగా ఆమె "కాంచన 4" లో నటించనున్నారని కోలీవుడ్ లో ప్రచారం సాగుతోంది. రాఘవ లారెన్స్ నటించి, దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో పూజ హెగ్డే ఓ డెవిల్ రోల్ చేయనున్నారని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది. త్వరలోనే ఈ హర్రర్ మూవీ కి సంబంధించి ఓ అప్డేట్ రానున్నట్లు సమాచారం.