బాలీవుడ్ డెబ్యూట్ కన్ఫర్మ్ చేసిన శ్రీలీల..! 22 d ago
శ్రీలీల, సిద్ధూ జొన్నలగడ్డ అతిథులుగా కనిపించిన "ది రానా దగ్గుబాటి షో" రెండొవ ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. శ్రీలీల షో లో తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు. తనకు ఇద్దరు సోదరులు ఉన్నారని, ఈ రోజుకి తన వెనుక ఉన్న శక్తీ తన తల్లి అని పేర్కొన్నారు. కాగా రానా, సిద్ధులు శ్రీలీలను బాలీవుడ్ అరంగేట్రం గురించి అడగ్గా మొదట్లో వారి ప్రశ్నలను తప్పించుకోవడానికి ప్రయత్నించింది. శ్రీలీల చివరికి తాను బాలీవుడ్ లో సినిమా చేయనున్నట్లు పేర్కొన్నారు.