Vivek Oberoi: తన తొలి ప్రేమను బయటపెట్టిన "వివేక్ ఒబెరాయ్"..! 11 d ago
రక్త చరిత్ర మూవీ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నటుడు "వివేక్ ఒబెరాయ్" తన తొలి ప్రేమ కథను బయటపెట్టారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "13 ఏళ్ల వయసులో నేను తొలిసారి ప్రేమలో పడ్డా.. తాను నాకంటే ఒక సంవత్సరం చిన్నది. అలా నాకు 18ఏళ్ళు వచ్చినప్పుడు ఆమెతో రిలేషన్ మొదలయ్యింది.. అప్పుడే తాను నా భార్య అని ఫిక్స్ అయ్యా. చదువు పూర్తి చేసి ఉద్యోగం, పెళ్లి, పిల్లలు ఇలా మా జీవితం గురించి ఎన్నో కలలు కన్నాను. తీరా ఒక రోజు తనకు ఆరోగ్యం బాగోలేదని నాతో చెప్పింది. జ్వరం లేదా జలుబు అయ్యుంటదిలే రెస్ట్ తీసుకొని మళ్లీ వస్తుందని అనుకున్న. ఎన్నిరోజులైనా కనిపించలేదు. ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వకపోవడంతో ఆమె బంధువుల అమ్మాయికి ఫోన్ చేశా.. తాను ఆసుపత్రిలో ఉందని ఆమె చెప్పింది. వెంటనే అక్కడి నుండి పరుగులు తీసి ఆసుపత్రికి వెళ్ళాను. ఆమెను ఆసుపత్రిలో బెడ్ పై చూసి తట్టుకోలేకపోయాను. ఆమె క్యాన్సర్ చివరి స్టేజిలో ఉందని తెలిసి షాక్ అయ్యా. తీరా రెండు నెలల వ్యవధిలో ఆమె కన్నుమూసింది. తన మరణం నన్ను ఎంతో కలిచివేసింది. నేను మళ్లీ సాధారణ మనిషిగా మారడానికి చాల కాలం పట్టింది. ఆ తర్వాతే క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారులకు నా వంతు సాయం చేయాలనే కోరిక మొదలయ్యింది" అని వివేక్ ఒబెరాయ్ తెలిపారు.