Dammunte Pattukora: "దమ్ముంటే పట్టుకోరా" పాటను యూట్యూబ్ లో తొలగించారు..! 12 d ago
పుష్ప 2 మూవీ నుంచి అల్లు అర్జున్ పాడిన "దమ్ముంటే పట్టుకోరా" సాంగ్ యూట్యూబ్ నుండి తొలగించబడింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు విచారించిన డిసెంబర్ 25న ఈ పాటను టీ- సిరీస్ తెలుగు ఛానల్ లో రిలీజ్ చేశారు. దీంతో ఈ పాట పోలీసులను ఉద్దేశించి పెట్టారని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేసారు. ఈ మేరకు ఈ సాంగ్ ను యూట్యూబ్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.