Actress Aishwarya: ఆయన పేరు తెలుసుకోడానికి గూగుల్ లో వెతికా..! 1 d ago
విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన "సంక్రాంతికి వస్తున్నాం" మూవీ ఈ నెల 14 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ప్రొమోషన్స్ లో నటి ఐశ్వర్య మాట్లాడుతూ తాను ఈ మూవీలో ఎలా భాగమయ్యారనే విషయం వెల్లడించారు. 'నేను తమిళంలోని ఓ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తుండగా అనిల్ రావిపూడి ఫోన్ చేశారు. నేను అనిల్ రావిపూడి ని మాట్లాడుతున్నాను అని అంటే ఆ పేరు నాకు తెలియదన్నాను. ఆయన సినిమాలు చూసాను కానీ ఆయన పేరు నాకు తెలీదు. ఆయన ఫోన్ లో మాట్లాడుతూ మేము ఇలా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాము. మీరు దానికి లుక్ టెస్ట్, ఆడిషన్స్ చేయాలి అని అన్నారు. మీరు నేను చేసిన తమిళ సినిమాలు చూసారా? దాదాపు 40కి పైగా మూవీస్ లో చేసానని ఆయనతో అన్నాను. దానికి ఆయన 'ఆలా కాదమ్మా మీరు మంచి నటి. ఆ విషయం నాకు తెలుసు కానీ ఈ మూవీ లో లుక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి అడిగాను అని అన్నారు. వెంటనే నేను సరే వస్తాను అని చెప్పాను. తర్వాత ఆయన గురించి గూగుల్ లో వెతికాను. అయ్యో ఆయన పేరు తెలుసుకోలేక పోయానే అని బాధ కలిగింది. ఆడిషన్ ఇవ్వడానికి ఇబ్బంది లేదు కానీ సడన్ గా తెలుగు ఇండస్ట్రీ నుండి ఆడిషన్ అడిగితే దానికి షాక్ అయ్యాను. తర్వాత ఆడిషన్, లుక్ టెస్ట్ లో ఓకే అయ్యి ఈ మూవీ లో నటించే అవకాశం వచ్చింది" అని ఐశ్వర్య రాజేష్ వెల్లడించారు.